నష్టాల్లో మునిగిన స్టాక్ మార్కెట్లు

SMTV Desk 2019-06-07 17:02:08  Sensex, Nifty, Stock market, Share markets

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొట్టుకుపోయాయి. ఆర్‌బీఐ కీలక రెపో రేటును పావు శాతం తగ్గించడంతో రెపో రేటు 5.75 శాతానికి దిగొచ్చింది. ఆర్‌బీఐ పాలసీలో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచే అంశాలు ఏవీ లేకపోయినా... లిక్విడిటీ సంక్షోభ నివారణకు స్పష్టమైన చర్యలను ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురైన మార్కెట్‌ భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ ఏకంగా 554 పాయింట్ల నష్టంతో 39,530 పాయింట్లకు క్షీణించింది. ఇక నిఫ్టీ 178 పాయింట్ల నష్టంతో 11,843 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఈ ఏడాది ఇదే ప్రథమం. రేట్ల కోతతో బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. దీంతో ఇండెక్స్‌లపై ప్రతికూల ప్రభావం పడింది.