రూమర్స్ వాళ్ళ చాల హ్యాపీ గా ఉన్న .. పూజిత

SMTV Desk 2019-06-07 17:00:49  Poojitha ponnada,

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో తనకు పెళ్లైందంటూ పుకార్లు షికారు కొట్టడం తనకు చాలా షాక్ ఇచ్చిందని అన్నారు నటి పూజిత పొన్నాడ. 7 సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె తనపై వస్తున్న వదంతులకు క్లారిటీ ఇచ్చారు.

అసలు ఆమె ఏమన్నారంటే.. నాకు దేవిశ్రీ సర్‌తో పెళ్లైందని రూమర్స్‌ వచ్చాయి. అసలు ఇలాంటివి ఎవరు సృష్టిస్తారో తెలీదు కానీ ఏకంగా ఫొటోలే మార్ఫ్‌ చేసి పెట్టేస్తున్నారు. రంగస్థలం సినిమా 100 డేస్‌ ఫంక్షన్‌లో దేవిశ్రీ సర్‌తో తొలిసారి మాట్లాడాను. అప్పటివరకు ఆయన నన్ను చూడలేదు కూడా. మా గురించి ఇలాంటి తప్పుడు రూమర్స్‌ రావడంపై కలత చెందాను. అవి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు అవుతోంది. అసలు మనం కలవని, మాట్లాడని ఓ వ్యక్తితో పెళ్లెలా అవుతుంది? ఇలాంటి వదంతులకు తలా, తోక ఉండదు. ఒకప్పుడు ఇలాంటి రూమర్స్‌ విని తెగ బాధపడేదాన్ని. కానీ.. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.. ఎందుకంటే వాటి ద్వారా తగినంత పాపులారిటీ కూడా వస్తుంది కదా అందుకు. సో సో హ్యాపీ అంటూ తెలిపారు పూజిత పొన్నాడ.