ఘనంగా రామానాయుడు విగ్రహావిష్కరణ

SMTV Desk 2019-06-07 16:59:58  Rama Naidu, Statue,

మూవీ మొఘల్ స్వర్గీయ రామానాయుడు విగ్రహావిష్కరణ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, కైకాల సత్యన్నారాయణ, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈరోజు రామానాయుడు జయంతి సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు రామానాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడంపై పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఎందరికో ఉపాధి కల్పించారు రామానాయుడు గారు. ఎందరో స్టార్స్ ను ఆయన వెండితెరకు పరిచయం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో 48 సినిమాలకు రచయితలుగా పనిచేశామని పరుచూరి బ్రదర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇన్ని సినిమాలు ఒక సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని పరుచూరి బ్రదర్స్ వివరించారు.