సెవెన్(7) మూవీ రివ్యూ

SMTV Desk 2019-06-07 16:56:37  Seven movie review,

ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా మన ముందుకు వస్తున్న చిత్రం సెవెన్(7). రహ్మాన్, హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి వంటి తారాగణం నటించారు. కాగా ఈ సినిమా ఈ రోజు ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కార్తీక్ (హవిష్ ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ.. యూఎస్ వెళ్లాలని గోల్ పెట్టుకుంటాడు. అయితే రమ్య (నందితా శ్వేతా), జెన్నీ (ఆనిశా), అదితి ఆర్యా ఇలా ముగ్గురు అమ్మాయిల ఒకరు తరువాత ఒకరు తమ భర్త కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లేయింట్ చేస్తారు.

ఆ తరువత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఆ అమ్మాయిల అందరూ చెప్పిన భర్త కార్తీక్ (హవిష్ ) ఒకరే అని తేలుతుంది. కార్తీక్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారని, పోలీస్ లు అతన్ని వెతికి పట్టుకుంటారు. కానీ అంతలో అచ్చం కార్తీక్ లాగే కృష్ణమూర్తి అనే మరో వ్యక్తి ఉండేవాడని తేలుతుంది. ఇంతకీ ఆ అమ్మాయిలను మోసం చేసింది కార్తీకేనా ? లేక కృష్ణమూర్తినా ? అసలు కృష్ణమూర్తి ఎవరు ? అయినా ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రేమ కథలు ఒకేలా ఎందుకు ఉన్నాయి ? మొత్తానికి కార్తీక్ జీవితంలో ఏమి జరిగి ఉంటుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :

ముందుగా ఈ చిత్రం కథాంశం ఆకట్టుకుంటుంది. మొత్తానికి రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని మలచాలని దర్శకనిర్మాతలు బాగానే ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఫిర్యాదులకు తగ్గట్లుగా ఇన్వెస్ట్ గేషన్ చేసే సీన్లు ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతాయి. అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అలాగే రెజీనా పాత్రకు సంబంధించిన సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే దర్శకరచయితలు థీమ్, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ కథనం విషయంలో మాత్రం విఫలం అయ్యారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి

ఇక హవిష్ నటన విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు. ఉన్నంతలో పర్వాలేదనిపించాడు.
ఇక కీలక పాత్రలో నటించిన రెజీనా నటన గురించి వేరే చెప్పక్కర్లేదు..ఏ పాత్ర అయినా అందుకు తగ్గట్టుగానే నటించే రెజీనా.. ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చింది. అలాగే కీ రోల్ లో కనిపించిన నందితా శ్వేతా మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. మిగిలిన హీరోయిన్స్ కూడా మంచి నటన కనబర్చారు.అలాగే రహ్మాన్ తదితరులు వారి పాత్రలకు తగ్గ న్యాయం చేకూర్చారు. ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ పాయింట్,
సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు మరియు ట్విస్ట్ లు.
రెజీనా నటన
సినిమా రొటీన్ గా సాగకపోవడం.

మైనస్ పాయింట్స్ :

కథనం,
లవ్ స్టోరీ బోర్ కొట్టడం,
ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం,
రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం,
క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం,
ఓల్డ్ గెటప్ లో నటించిన నటి ఆ పాత్రకు సరిగ్గా సూట్ కాకపోవడం.

తీర్పు :

ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని మలచాలని దర్శకనిర్మాతలు బాగానే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కథాంశం, కథానుసారం వచ్చే ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో కొన్ని అంశాలు ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అయితే సెకెండ్ హాఫ్ స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం, రెజీనా పాత్ర ఓల్డ్ గెటప్ బాగా ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.