కార్తికేయ హిప్పీ రివ్యూ

SMTV Desk 2019-06-07 16:55:53  Karthikeya, hippi,

టిఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా, దిగంగన సూర్యవంశి, జజ్బా సింగ్ హీరోయిన్లుగా కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన లవ్ ఎంటర్‌టైనర్ -హిప్పీ. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

దేవదాసు (కార్తికేయ) స్నేహతో (జజ్బా సింగ్) ఆల్ రెడీ లవ్ లో ఉంటాడు. అయితే స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశి)ను చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు. ఇక ఆమెను ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆముక్తమాల్యద దేవ్ ప్రేమను అంగీకరిస్తోంది. అయితే తన చెప్పిన ప్రతి పనిని చెయ్యాలని షరతు పెడుతుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వస్తాయి. వాటి మూలంగా వారి జీవితంలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? ఈ క్రమంలో వారి మధ్యన ఆనంద్ ( జేడీ చక్రవర్తి) ఎలాంటి పాత్రను పోషించాడు ? ఇంతకీ వాళ్లిద్దరూ మళ్లీ కలిసారా ? లేదా ? అనేదే మిగతా కథ.

విశ్లేషణ :

రొమాంటిక్ డ్రామా వచ్చిన ఈ సినిమాలో థీమ్ తో పాటు యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, అలాగే కార్తికేయ నటన, కొన్ని డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. ఇక హీరోగా నటించిన కార్తికేయ పాత్రకు తగ్గట్లు తన సిక్స్ ప్యాక్ తో తన డాన్స్ మూమెంట్స్ తో అదే విధంగా తన నటనతో మెప్పిస్తాడు. మెయిన్ గా కార్తికేయ బాక్సింగ్ సీన్ లో, ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ తో గొడవ పడే సీన్ లో ఆ తరువాత ఇద్దరూ ఒకటయ్యే సీన్ లో చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన దిగంగన సూర్యవంశి బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత నటించిన జేడీ చక్రవర్తి కూడా ఆనంద్ పాత్రలో ఒదిగిపోయారు. జేడీ చక్రవర్తి చేత చెప్పించిన డైలాగ్స్ కూడా యూత్ ను అలరిస్తాయి. వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ , తన శైలి మాడ్యులేషన్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించాడు. మరో హీరోయిన్ జజ్బా సింగ్, బ్రహ్మాజీ హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సినిమాలో మ్మెయిన్ పాయింట్ పర్వాలేదనిపించినా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించి అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఇక లవ్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. దీనికి తోడు సినిమాలో అక్కడక్కడ బూతులు శృతిమించాయి

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ థీమ్,
కొన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్
డైలాగ్స్ మరియు కార్తికేయ నటన.

మైనస్ పాయింట్స్ :

కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం,
సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం,
అలాగే, సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం,
అనవసరమైన కామెడీ అండ్ లవ్ సీన్స్.

తీర్పు :

ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవంశి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ లవ్ ఎంటర్‌టైనర్ సరైన ప్లో లేకుండా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. స్టోరీ ఐడియాకి తగ్గట్లు సరైన ట్రీట్మెంట్ ను లేకపోవడం, విషయం లేని సీన్స్ ఎక్కువవడం, పైగా ఉన్న కంటెంట్ కూడా సరిగ్గా ఎలివేట్ అవ్వకపోవడం, అలాగే సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి కనెక్ట్ కాకుండా చేశాయి. ఓవరాల్ గా ఈ లవ్ ఎంటర్‌టైనర్ ఎక్కువమంది ప్రేక్షకులకు నిరాశనే మిగులుస్తోంది.