ఆసిస్ పై ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్

SMTV Desk 2019-06-06 15:52:27  Australia vs west indies

ప్రపంచకప్ మెగా టోర్నీలో భాగంగా నేడు నాటింగ్ హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అదే జోరుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గత శుక్రవారం పాకిస్థాన్‌పై సంచలన గెలుపుని నమోదు చేసిన వెస్టిండీస్ కూడా అదే ఊపుని కొనసాగించాలని ఆశిస్తోంది. దీంతో.. ఈరోజు మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగనుంది.
West Indies (Playing XI): Chris Gayle, Evin Lewis, Shai Hope(w), Nicholas Pooran, Shimron Hetmyer, Andre Russell, Jason Holder(c), Carlos Brathwaite, Ashley Nurse, Sheldon Cottrell, Oshane Thomas .
Australia (Playing XI): Aaron Finch(c), David Warner, Usman Khawaja, Steven Smith, Glenn Maxwell, Marcus Stoinis, Alex Carey(w), Nathan Coulter-Nile, Pat Cummins, Mitchell Starc, Adam Zampa .