సెక్యూరిటీ గార్డ్‌ను కొట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

SMTV Desk 2019-06-06 15:50:44  salman khan,

ముంబయి : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘భారత్’. ఈనెల 5న విడుదలైన ఈ సినిమా విజయం వైపు దూసుకెళుతోంది. వంద కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ సినిమా ప్రీమియర్ షోను చూసి వెళుతున్న సల్మాన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ బాలుడు కూడా సల్మాన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సదరు బాలుడిని సల్మాన్ బాడీగార్డు నెట్టేశాడు. దీంతో ఆ బాలుడు కింద పడ్డాడు. అతడిని లేపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సల్మాన్ బాడీ గార్డుపై చేయి చేసుకున్నాడు. అనంతరం సల్మాన్ ఆ బాలుడిని పైకి లేపి తన మంచి మనస్సు చాటుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.