కప్ తోనే తిరిగి రావాలి!

SMTV Desk 2019-06-06 15:46:45  sachin tendulkar, icc world cup 2019

ప్రపంచకప్ మెగా టోర్నీలో శుభారంభం చేసిన టీంఇండియాను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. మొదట ఇన్నింగ్స్ పూర్తి చేసి దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(122 నాటౌట్) అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ధోనీ(34), కెఎల్ రాహుల్(26), విరాట్ కోహ్లీ(18), హర్దిక్ పాండ్యా(15 నాటౌట్) పరుగులు చేశారు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో మొర్రీస్(42), డూప్లిసెస్ (38), ఫెహ్లూక్యాయో(34), మిల్లర్(31), డస్సెన్(22), రబడా(31), డికాక్(10), ఆమ్లా(6), డిమిని(3) పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగి సఫారి జట్టుకు కళ్లెం వేశాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంపై స్పందించిన సచిన్.... టీమిండియా బాగా ఆడిందని కొనియాడాడు. చాహల్, బుమ్రా గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారని ప్రశంసించాడు. ఇక, రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్భుతమని, పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ అన్నాడు. అతడి బ్యాటింగ్ చూడటం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. చివరి వరకు ఇలాగే ఆటను కొనసాగించి కప్ తో తిరిగి రావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.