దేశభక్తిని చాటిచెప్పిన ధోని

SMTV Desk 2019-06-06 15:44:47  dhoni

ప్రపంచకప్ టోర్నీలో బుధవారం మొదటి మ్యాచ్ ఆడిన టీంఇండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని ధ‌రించిన గ్లౌజ్‌లు అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి. ధోని ధరించిన గ్లౌజ్‌లు తన దేశభక్తిని చాటిచెప్పాయి. ధోనీ ముదురు ఆకుప‌చ్చ‌ రంగులో ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించాడు. ఆ కీపింగ్ గ్లౌజ్‌ల‌పై ఓ ఆసక్తికర చిహ్నం ఉంది. అది మన దేశ పారామిలిట‌రీ ద‌ళాల‌కు చెందిన గుర్తని.. దాన్ని బ‌లిదాన్ బ్యాడ్జిగా పిలుస్తారని తెలుస్తుంది. 2011లో మన ప్రభుత్వం ధోనీకి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ర్యాంక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఆర్మీ క్యాంపులో ధోని శిక్షణ కూడా తీసుకున్నాడు. శిక్ష‌ణ స‌మ‌యంలో అయిదు ప్యారాచూట్ జంప్‌లు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే బ‌లిదాన్ బ్యాడ్జ్ ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించిన ధోనీకి.. ట్విట్ట‌ర్‌లో అభిమాన‌లు సెల్యూట్ చేస్తున్నారు.