సుడాన్ ఆర్మీ క్రూరత్వం...100 మందిని చంపి నదిలో పడేశారు!

SMTV Desk 2019-06-06 15:39:56  Sudan army kills 100 people

ఆర్మీ పాలనకు వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్న వారిపై అక్కడి సైన్యం క్రూరత్వ చర్యలకు పాల్పడుతుంది. అందోళన నిర్వహిస్తున్న ఉద్యమకారులను అతిదారుణంగా చంపి నదిలో పడేస్తున్నాయి మిలిటరీ దళాలు. ఇప్పటికే 100 మందిని చంపారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈనేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ...మంగళవారం మరోసారి ఆందోళలు జరిగాయి. ఈనేపథ్యంలోనే మిలిటరీ అధికారులు 40మంది ఆందోళనకారులను చంపి నైలు నదీలో పడేశారని, వారిని నది నుండి వెలికి తీశామని , పోరాటం చేస్తున్న సూడనీస్ సెంట్రల్ కమిటి పేర్కోంది. దీంతోపాటు ఇదే విధంగా 100మందిని చంపారని వారి మృతదేహలను ఆసుపత్రిలో కనుగొన్నామని వారు చెబుతున్నారు.