గూగుల్ మ్యాప్స్ యాప్‌లో నయా ఫీచర్!

SMTV Desk 2019-06-06 15:38:44  google maps

ప్రముఖ గూగుల్ సంస్థ తన గూగుల్ మ్యాప్స్ యాప్‌లో తాజాగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో మీరు మీ వాహనంపై ఎంత స్పీడ్‌తో వెళ్తున్నారో లైవ్‌లో చూడొచ్చు. అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. యాప్‌లోని సెట్టింగ్స్‌లోని వెళ్లి నావిగేషన్ సెట్టింగ్స్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ స్పీడో‌ మీటర్ ఆప్షన్ ఓకే చేయాలి. గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్ కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులోకి వచ్చింది. తర్వాలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు. గూగుల్ మ్యాప్స్ యాప్ మీర ఎంత స్పీడ్‌తో వెళ్తున్నారనే అంశంతోపాటు సంబంధిత ప్రాంతంలో స్పీడ్ లిమిట్స్‌ను కూడా తెలియజేస్తుంది.