సెల్ఫీ తీసుకుంటుండగా సీఎం ఆగ్రహం.. వైరల్ వీడియో

SMTV Desk 2019-06-06 14:33:08  cm,selfie

ఛండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకోబోతున్న ఓ యువకుడిపై సిఎం ఫైర్ అయిన సంఘటన హర్యానాలోని కర్నాల్‌లో జరిగింది. సిఎం ఖట్టర్‌ ఓ కార్యక్రమం నిమిత్తం కర్నాల్‌ వెళ్లారు. ఈ సమయంలో అక్కడున్న ఓ యువకుడు ఆయన పాదాలను తాకి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన మనోహర్ లాల్ ఖట్టర్ ఆ యువకుడిని అడ్డుకుని చేయిపై కొట్టారు.
అనంతరం ముందుకు వెళ్లిపోయారు సిఎం. ఆయన సహనం కోల్పోవడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు దంపతులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి సిఎం వద్దకు వెళితే సమయంలో ఆయన చిరాకు పడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడంతో ఆయన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.