రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసే అవకాశం

SMTV Desk 2019-06-06 14:31:45  ravi prakash,

ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ వరుసగా మూడో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న రెండో రోజు కూడా పోలీసులు విచారించారు. ఉదయం 11:30 నుంచి రాత్రి 10:45 గంటల వరకు దాదాపు 11 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించారు. అయితే, పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో నేడు మరోమారు ఆయనను విచారించాలని సైబర్ క్రైం పోలీసులు నిర్ణయించారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేసే ధోరణి కనబర్చారని సమాచారం. అయితే ఆయన విచారణకు సహకరించట్లేదని ఈ రోజు సహకరించకపోతే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మొదటి రోజు 6 గంటలు, రెండోరోజు 11 గంటలపాటు రవిప్రకాశ్‌ విచరణ కొనసాగింది. ఈ విచారణలో పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాశ్‌ పొంతన లేని జవాబులిస్తున్నారని గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాత్రి ఇంటికి పంపేసిన పోలీసులు నేడు మరోమారు విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌ను కోరారు. ఈ రోజు కూడా ఆయన ఇలాగే సమాధానాలు దాటవేస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.