లక్కీ ఛాన్స్ కొట్టేసిన వింక్ బ్యూటీ

SMTV Desk 2019-06-06 14:29:53  priya prakash warrier,

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ ఒరు అధార్ లవ్ సినిమా చిన్న టీజర్ తో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో లవర్స్ డేగా రిలీజైన ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమాకు ముందు హంగామా చేసిన ప్రియా ప్రకాశ్ సినిమా ఫ్లాప్ అవగానే ఆమెను పలుకరించే వాళ్లే లేరు. తెలుగులో ఒకటి రెండు యువ హీరోల ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పిన ప్రియా ప్రకాశ్ ఫైనల్ గా ఓ తెలుగు ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిదని తెలుస్తుంది.

లవర్ బోయ్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో తెరకెక్కే సినిమాలో ప్రియా ప్రకాశ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. మనమంతా తర్వాత గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ యేలేటి నితిన్ తో మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ప్రియా ప్రకాశ్ వరియర్ కెరియర్ కు మంచి జోష్ వస్తుందేమో చూడాలి.