నువ్వు షర్ట్ విప్పితే నేను ఫ్యాంట్ విప్పేస్తా

SMTV Desk 2019-06-06 14:29:16  hippi, jd, kaarthikeya,

ఆరెక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా హిప్పి. ఈ సినిమాలో ఒకప్పటి హీరో జెడి చక్రవర్తి కూడా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తికేయ, జెడిల తీరు పట్ల ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సినిమా కాన్సెప్ట్ చెప్పేలా వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆరెక్స్ 100తో వచ్చిన హాట్ ఇమేజ్ కొనసాగించేలా కార్తికేయ హిప్పి కోసం ఏకంగా షర్ట్ విప్పేసి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ తర్వాత ఇంతకీ హిప్పీ అంటే ఏంటి సార్ అని అడిగితే చెప్పడం కాదు చూపిస్తాం అంటూ కార్తికేయ షర్ట్ విప్పేయ్గా.. జెడి చక్రవర్తి ఫ్యాంట్ విప్పేసి అండర్ వేర్ మీదే నడుచుకుంటూ వెళ్లారు. అయితే నువ్వు షర్ట్ విప్పితే నేను ఫ్యాంట్ విప్పేస్తా అని జెడి కూడా ఫ్యాంట్ విప్పేసి అండర్ వేర్ తో నిలబడ్డాడు. సినిమా ప్రమోషన్స్ కోసం మరి ఇంతగా దిగజారాలా అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ప్రమోషన్స్ వల్ల సినిమాపై బజ్ ఏర్పరడం అటుంచితే కచ్చితంగా ఓ నెగటివ్ ఫీడ్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ అతిని భరించలేని ప్రేక్షకులు హిప్పి కార్తికేయ, జెడిల మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.