ఎవరెస్ట్‌ ప్రక్షాళనలో నాలుగు మృతు దేహలు లభ్యం

SMTV Desk 2019-06-06 14:25:43  mount Everest in Nepal Kathmandu

ఖాట్మండు: అతిఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ప్రక్షాళనలో నాలుగు మృతు దేహలాను వెలికితీసినట్లు నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాక రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కొన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయిన 11 వేల కేజీల చెత్తను తొలగించినట్లు నేపాల్‌ ప్రభుత్వం తెలిపింది. పర్వతారోహణలో భాగంగా ఇక్కడ సుమారు 300 మంది వరకు చనిపోయి ఉండవచ్చని ఆ దేశ అధికాయిల అంచనా వేస్తున్నారు. మృతేదేహాలు మంచు అడుగున్న పడి ఉండవచ్చని, వేసవిలో మంచు కరగడంతో కొన్ని బయటకు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఐతే వారు ఎప్పుడు, ఎలా చనిపోయారో వివరాలు తెలియడం లేదని అధికారులు చెప్పారు.