సెమీఫైనల్లోకి ఫెదరర్, నాదల్‌

SMTV Desk 2019-06-06 14:24:47  roger federe, rafel nadal

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో రోజర్ ఫెదరర్, స్పానిష్ బుల్ రఫెల్ నాదల్‌లు తలపడేందుకు సిద్దమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫెదరర్ తన దేశానికే చెందిన స్టాన్ వార్వింకాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ జపాన్‌కు చెందిన కీ నిషికోరిపై 6 1,6 1,6 3 స్కోరుతో వరస సెట్లలో సుపాయాసంగా విజయం సాధించి సెమీఫైనల్లోకి చేరుకున్నాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 13 సార్లు తలపడగా నాదల్ 11 సార్లు విజయం సాధించాడు.