సమంత ప్లేస్ లో సాహో హీరోయిన్ !

SMTV Desk 2019-06-06 13:03:34  samantha, shradha kapoor,

పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేషియో డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు రావడమే ఎక్కువ అలాంటిది వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా సూపర్ హిట్లు కొట్టడం అది కేవలం సమంత వల్లే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఓ బేబీ సినిమా రీమేక్ లో నటిస్తున్న సమంత మన్మథుడు 2లో కూడా నటించేందుకు సిద్ధమైంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా వస్తుంది ఓ బేబీ.

నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత, నాగ శౌర్య నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారట హిందిలో ఈ సినిమాలో లీడ్ రోల్ గా శ్రద్ధా కపూర్ నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ సాహోతో తెలుగు తెరకు పరిచయమవుతున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కానుంది. తెలుగులో వచ్చే నెల రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాలీవుడ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారని తెలుస్తుంది.