ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే...ఐదేళ్ళు జైలు, 10 లక్షల జరిమానా!

SMTV Desk 2019-06-06 12:47:59  fake news, srilanka government new rules in social media

శ్రీలంకలో ఈ మధ్య జరిగిన వరుస బాంబు పేలుళ్ళ సందర్భంగా ఆ ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు ఫేస్ బుక్, వాట్సాప్ , ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తే వారికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించనున్నామని తాజాగా ప్రకటించింది. తాజా శిక్షల తాలూకు ప్రతిపాదనను తాత్కాలిక న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టగా దాన్ని మంత్రి మండలి ఆమోదించింది. కొత్త శిక్షలను అమలు చేసేందుకు పీనల్ కోడ్ ను సవరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఏళ్ళ తరబడి జాతి విద్వేషాలు రగులుతున్న ఈ దేశంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఇంకా తప్పుడు, ద్వేష పూరితమైన, రెచ్చగొట్టే సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కళ్ళు తెరచింది. దేశ రాజధానిలో గత మార్చి నెలలో ముస్లిం వ్యతిరేక బృందాలు పెద్ద ఎత్తున హింసకు దిగడంతో సర్కార్ ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది.దాన్ని బ్యాన్ చేసింది. కాగా-సింగపూర్ పార్లమెంటు కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి ఇలాంటివారికి 10 ఏళ్ళ జైలుశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది.