మెగా టోర్నీలో భారత్ శుభారంభం

SMTV Desk 2019-06-06 12:41:04  India vs South africa

ప్రపంచకప్ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడిన టీంఇండియా విజయంతో భోనీ చేసింది. సఫారీలపై కోహ్లీ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట ఇన్నింగ్స్ పూర్తి చేసి దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(122 నాటౌట్) అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ధోనీ(34), కెఎల్ రాహుల్(26), విరాట్ కోహ్లీ(18), హర్దిక్ పాండ్యా(15 నాటౌట్) పరుగులు చేశారు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో మొర్రీస్(42), డూప్లిసెస్ (38), ఫెహ్లూక్యాయో(34), మిల్లర్(31), డస్సెన్(22), రబడా(31), డికాక్(10), ఆమ్లా(6), డిమిని(3) పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగి సఫారి జట్టుకు కళ్లెం వేశాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.