తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్?

SMTV Desk 2019-06-06 12:36:12  Mahender redy, congress

త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి త్వరలో తెరాసలో చేరేందుకు తెర వెనుక మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. తెరాసలో పట్నం మహేందర్ రెడ్డికి, పైలట్‌ రోహిత్‌రెడ్డి బేధాభిప్రాయాలున్నాయి. 2018 ముందస్తు ఎన్నికలలో తాండూర్ నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొన్నారు. కానీ మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి తాండూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తున్నందున మళ్ళీ సొంత గూటికి చేరుకోవాలనుకొంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసినందున రోహిత్ రెడ్డితో కాంగ్రెస్‌లో మళ్ళీ ఫిరాయింపులు మొదలవవచ్చు.