మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన అల్లరి నరేష్

SMTV Desk 2019-06-06 12:33:02  Allari Naresh,

హీరోగా బాగా వెనుకపడ్డ అల్లరి నరేష్ మహర్షి సినిమాలో రవి పాత్రకు మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాలో అల్లరోడు కూడా భాగం అయ్యాడు. మహేష్ తో నటించడం ఓ మంచి అనుభూతని చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం సోలో హీరోగా కూడా మళ్లీ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మరో స్టార్ సినిమాలో లక్కీ ఛాన్స్ పట్టేశాడని తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా డిస్కో రాజా.

ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవితేజ డిస్కో రాజాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారట. అసలైతే ఆ రోల్ లో సునీల్ నటించాల్సి ఉండగా సునీల్ ఎక్సిట్ అయ్యి అల్లరి నరేష్ ఎంటర్ అవుతున్నాడట. ఆల్రెడీ రవితేజతో శంభో శివ శంభో సినిమాలో కలిసి నటించాడు అల్లరి నరేష్. ఆ సినిమా హిట్ కొట్టింది. మరి మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ డిస్కో రాజాలో కలిసి చేస్తున్నారు. రవితేజ మాత్రం ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.