'దొరసాని' టీజర్ చూసారా

SMTV Desk 2019-06-06 12:32:27  dorasani ,

ప్రేమ కథలు ఎన్నొచ్చినా మళ్లీ వాటినే తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. కథ రొటీన్ గా ఉన్నా కథనంతో మెప్పించడమే దర్శకుల పని. లేటెస్ట్ గా మరో వీర ప్రేమకథతో వస్తున్న సినిమా దొరసాని. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రాజశేఖర్, జీవితల చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా వస్తున్న సినిమా దొరసాని. కె.వి.ఆర్ మహేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మధురా శ్రీధర్ నిర్మిస్తున్నారు.



ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంప్రెస్ చేసిన ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. రాజు.. దేవకిల ప్రయణ గాథ దొరసాని సినిమా కథ. సినిమాలో శివాత్మిక లుక్ ఇంప్రెస్ చేసింది. రాజు పాత్రలో ఆనంద్ దేవరకొండ కూడా పర్వాలేదు అనిపించాడు. టీజర్ అయితే ఆడియెన్స్ ను మెప్పించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్, బిగ్ బెన్ సినిమాస్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా ఉంటున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి దొరసాని సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.