సీఆర్డీఏ సమీక్ష రద్దు...

SMTV Desk 2019-06-06 12:31:55  jagan,

ఏపీ కొత్త సీఎం జగన్ గత కొద్ది రోజులుగా శాఖలవారీ సమీక్షలు జరుపుతున్న సంగతి విదితమే. నిజానికి ఇప్పటిదాకా సమీక్షలు జరగని కొన్ని శాఖల మీద ఏఒర్జు సమీక్ష నిర్వహించాలని భావించారని దీంతో సీఆర్‌డీఏ మీద జగన్ చేపట్టనున్న సమీక్షా సమావేశం వాయిదా పడినట్లు తెలిసింది. నిజానికి ఈరోజు సిఆర్డీయే, ఏడిసి విభాగాల సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ సమీక్షలో రాజధానిలోని అన్ని నిర్మాణాలపై మీద, అలాగే గత ఐదేళ్లలో సిఆర్డీయే, ఏడిసి చేపట్టిన పనులు, అభివృద్ధి పనుల వివరాలు, ఎంత వ్యయంతో పనులు జరుగుతున్నాయి వంటి అంశాలపై సమీక్ష జరగనుందని సమాచారం. ఇక ఈరోజు వైఎస్ జగన్ జలవనరుల శాఖ మీద సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని సరిగ్గా వినియోగించుకునేందుకు కూడా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షల్లో భాగంగా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా జగన్ సమీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమీక్షకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ సమీక్షకు హాజరుకానున్నారు.