టెక్సాస్ లో టెన్షన్... టెన్షన్ ...

SMTV Desk 2017-08-29 16:01:19  AMERIKA, TEXAS, HARVEY THUFFAN, FLUDS

అమెరికా ఆగస్ట్ 29: అమెరికాను హర్వే తుఫాను అతలాకుతలం చేస్తుంది. హర్వే ధాటికి టెక్సాస్ తీర ప్రాంతం మొత్తం విలవిలలాడుతుంది. హ్యూస్టన్ నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. 72 గంటల్లో 74 సెంటి మీటర్ల కుండపోత వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వరదల్లో 200 మంది భారతీయులు చిక్కుకోగా, ఐదుగురు ప్రాణాలను కోల్పోయారు. బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ఇప్పటికే 13 లక్షల మందిపై ఈ వరద ప్రభావం పడిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 1200ల మందికి రక్షణ కల్పించిన బృందం,పడవలు,హెలికాప్టర్ ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ఉధృతిపై అమెరికా అద్యక్షుడు "ట్రంప్" సమీక్ష నిర్వహించారు.