ఆస్ట్రేలియాలో సాయుధుడి కాల్పులు...నలుగురు మృతి!

SMTV Desk 2019-06-06 12:29:20  gun firing in hotel

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ఓ హోటల్లో ఓ సాయుధుడు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఒక మహిళకు గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాదేశిక (ఎన్టీ) పరిధిలోని డార్విన్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీ పోలీసులు రంగ ప్రవేశం చేసి కాల్పులు జరిపిన సాయుధుడు (45)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు ఉగ్రవాద దాడులతో సంబంధం లేదని చెప్పారు. దుండగుడు హోటల్‌లో ఒక్కో రూమ్‌కు వెళ్లి చూసి మరీ కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గత జనవరిలోనే జైలు నుంచి సాయుధుడు విడుదలై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్ విచారం వ్యక్తం చేశారు.