హెన్నా పెట్టుకొని ఆసుపత్రిపాలు!

SMTV Desk 2019-06-06 12:28:12  girl affect her hand due to henna in egypt

ఈజిప్ట్: సరదాగా చేతికి హెన్నా పెట్టుకొని ఓ చిన్నారు ఆసుపత్రి పాలయ్యింది. ఈ సంఘటన ఈజిప్టులో చోటుచేసుకుంది. సెలవులను ఆనందంగా గడపడం కోసం యూకేకి చెందిన ఏడేళ్ల చిన్నారి కుటుంబం ఈజిప్టుకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు హోటల్ సిబ్బంది మాడిసన్ గుల్లివర్‌కి చేతికి హెన్నా పెట్టారు. హెన్నా పెట్టుకున్న కొద్ది సేపటికే పాప చేయికి దురద రావడం మొదలైంది. గమనించిన తల్లి వెంటనే వాష్‌రూమ్‌కి తీస్కెళ్లి హెన్నా చేయి కడిగేసింది. అయినా దురద తగ్గకపోగా హెన్నా పెట్టించుకున్న భాగమంతా బొబ్బలు వచ్చాయి. వెంటనే పాపని తీసుకుని దగ్గర్లోని హాస్పిటల్‌కు వెళ్లారు తల్లిదండ్రులు. పాపని పరీక్షించిన వైద్యులు హెన్నాలో వాడిన కెమికల్స్ కారణంగానే బొబ్బలు, దురదలు వచ్చాయని తెలిపారు. బొబ్బలుగా ఏర్పడిన చర్మాన్ని తొలగించి చికిత్స అందించారు. హెన్నా పెట్టుకునేముందు పేరున్న కంపెనీదో కాదో తెలుసుకుని పెట్టుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్లు. లేదంటే ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.