జియో ప్రపంచకప్ ఆఫర్!

SMTV Desk 2019-06-06 12:27:07  jio world cup offer

ప్రపంచకప్ మెగా టోర్నీ సందర్భంగా టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సంస్థ తమ వినియోగదారుల కోసం మరో ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచులను ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జి చేసుకోవాలి.ఈ రీఛార్జి ప్రకారం 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందుతారు. దీనితో పాటు జియో వినియోగదారులు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుండి హాట్‌ స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే, మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలలో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు కూడా లభిస్తాయి.