దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు

SMTV Desk 2019-06-06 12:23:53  ramzan,

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కశ్మీర్, యూపీ ప్రాంతాల్లో ముస్లిం సోదరుల ప్రార్థనలు భారీగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే ఈద్గాల దగ్గరకు వెళ్లి.. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రంజాన్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

హైదరాబాద్ మక్కా మసీద్, మీర్ అలం దర్గా, యూసఫ్ గూడాలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్గాలకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించారు.