ఆయనో గ్రాఫిక్స్ డైరెక్టర్: వడివేలు సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-06-06 12:23:17  vadivelu, shanker,

తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ మీద సంచలన వ్యాక్యాలు చేశాడు కమెడియన్ వడివేలు. చాన్నాళ్ళగా మీడియాకి దూరంగా ఉన్న ఆయన రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలియన్ ఫ్రెండ్స్ సినిమాలో వడివేలు కాంట్రాక్టర్ నేసమణి అనే పాత్ర పోషించారు. అందులో ఆయన తలపై సుత్తి పడడంతో బలమైన గాయలవుతుంది. ఆ సన్నివేశం ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. దీంతో పలు టీవీ ఛానళ్ళు వడివేలు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. దర్శకుడు శంకర్ అప్పటినుండి ఇప్పటివరకు గ్రాఫిక్స్ సన్నివేశాలతోనే దర్శకుడిగా నెట్టుకోస్తున్నారని, ఆయనో గ్రాఫిక్స్ డైరెక్టర్ అంటూ విమర్శలు చేశారు వడివేలు. ఈ రకంగా శంక‌ర్‌, వ‌డివేలు మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. శంక‌ర్ రూపొందించిన ప‌లు సినిమాల్లో వ‌డివేలు కీల‌క పాత్ర‌లు పోషించాడు. వ‌డివేలు హీరోగా రూపొందిన `హింసించే 23వ పులికేసి` సినిమాను కూడా శంక‌ర్ నిర్మించాడు. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య విభేదాలు త‌లెత్తిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శంక‌ర్‌పై ఆయన విమ‌ర్శ‌లు కురిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలింది.