రవితేజ, పాయల్ రొమాన్స్ అదరహో అంటున్న చిత్ర యూనిట్

SMTV Desk 2019-06-06 12:22:06  Payal rajput,

రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో రవితేజ, వెన్నెల కిషోర్‌ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక రవితేజ, పాయల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలను ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని అంటున్నారు. ఇక మరో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః కార్తిక్ ఘట్టమనేని, డైలాగ్స్‌ః అబ్బూరి రవి, మ్యూజిక్‌ః తమన్, ఎడిటర్‌ః నవీన్ నూలి.