టిఫనీ ట్రంప్ గురించి తెలుసా!

SMTV Desk 2019-06-06 12:17:50  tiffany trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ గురించి అందరికి తెలుసు. కాని టిఫనీ ట్రంప్ గురించి పెద్దగా ఎవ్వరికి తెలీదు. ఆమె పేరు టిఫనీ ట్రంప్. వయసు పాతికేళ్లు. నిజానికి.. ఉన్నతస్థాయి సంబంధాలున్న యువ, సంపన్న సోషల్ మీడియా ప్రముఖుల బృందం స్నాప్ ప్యాక్ లో టిఫనీ ఒకరని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. డోనల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యాపార లావాదేవీల్లో ఆయన కూతురు ఇవాంకా, కొడుకులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు చాలా సన్నిహితంగా పాలుపంచుకుంటుంటే.. వారి సవతి సోదరి టిఫనీ మాత్రం న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నారు.ఆమె వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ లా స్కూల్‌లో 2017 నుంచి చదువుకుంటున్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తండ్రి డోనల్డ్ ట్రంప్‌తో పాటు తన సోదరులు పాలుపంచుకున్నా.. టిఫనీ కనిపించలేదు.ఆమె చదువుల్లో బిజీగా ఉండటం వల్ల ప్రచారంలో పాలుపంచుకోలేదని చెప్తుంటారు.అయితే.. 2016లో జరిగిన రిపబ్లికన్ జాతీయ సదస్సులో ప్రసంగించారు. తన తండ్రి చాలా స్నేహపూర్వకంగా, హాస్యపూరితంగా, వాస్తవికంగా ఉంటారని ప్రసంశించారు.