గ్రౌండ్‌లోకి స్విమ్ సూట్‌లో వచ్చిన యువతి హళ్ చల్

SMTV Desk 2019-06-06 12:08:31  kinsey volansky

స్పెయిన్‌లోని మాడ్రిడ్ వేదికగా ఛాంపియన్స్ లీగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లివర్ పూల్, టోటెన్హమ్ జట్లు మధ్య జరుగుతుండగా ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్‌లోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించింది. రష్యాకు చెందిన ప్రముఖ మోడల్ కిన్సే వోలాన్స్‌స్కీ అర్థనగ్నంగా గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటకు అంతరాయం కలిగించింది. సెక్యూరిటి సిబ్బందిని తప్పించుకుని గ్రౌండ్‌ మొత్తం పరుగులు తీసింది. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించి వేశారు. ఈ విషయాన్ని వోలాన్స్‌స్కీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది."ఈ రోజు చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను. ఎంతో గర్వంగా ఉంది అంటూ స్విమ్ సూట్‌లో ఉన్న ఫోటోని పోస్టు చేసింది. x-రేటెడ్ వెబ్‌సైట్‌ Vitaly Uncensored ప్రమోషన్‌లో భాగంగా ఇలా చేసిందని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.