నీట్ ఫలితాలు విడుదల

SMTV Desk 2019-06-06 12:04:01  neet results,

కాసేపటి క్రితం నీట్ పలితాలను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (నీట్‌)ను మే 5న నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

అయితే దేశం మొత్తం మీద 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా.. 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒడిశాలో ఫొని తుపాను, కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా అక్కడి అభ్యర్థుల కోసం మే 20న అధికారులు మరోసారి పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను కూడా ఈరోజు విడుదల చేశారు. ఇక తెలంగాణ నుండి 51 వేల మంది దరఖాస్తు చేసుకోగా... 48, 996 మంది హాజరయ్యారు. వీరిలో 33,044 మంది అర్హత సాధించారు. ఇక గతేడాది నీట్ అర్హత సాధించిన వారి శాతం 68.88 శాతంగా ఉండగా.. ఈ ఏడాది అది 67.44 శాతంగా నమోదైనట్లు తెలుస్తోంది.

అదేవిధంగా రాజస్తాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్‌వాల్‌ 701 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించగా, తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి 695 మార్కులతో 7వ ర్యాంక్‌ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా అమ్మాయిల్లో మొదటి ర్యాంకు సాధించింది. అలాగే ఏపీ విద్యార్థిని కురేషే హస్రా 16వ ర్యాంకు దక్కించుకుంది.