పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదు : పృథ్వి(30 ఇయర్స్ ఇండస్ట్రీ)

SMTV Desk 2017-08-29 15:31:00  PAWAN KALYAN, KATTI MAHESH, PRUDHVI 30 YEARS INDUSTRY, TWITS

హైదరాబాద్, ఆగస్ట్ 29 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వచ్చిన విమర్శకులపై సినీ నటుడు పృథ్వి(30 ఇయర్స్ ఇండస్ట్రీ) మండిపడ్డారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు విధితమే. కాగా పెద్ద నటులపై విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. గొప్ప వారిని విమర్శించే ముందు మన స్థాయి ఏ౦టన్నది ఆలోచించుకోవాలని అన్నారు. అంతే గాని ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం, రాయడం సరికాదని తెలిపారు. సినిమా గురించి కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం చాలా తప్పని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరి పరిధిలో వారు ఉంటే మంచిది పరిధి దాటి మాట్లాడితే అభిమానుల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.