జెట్ ఇప్పటికైనా జాగ్రత్తపడాలి!

SMTV Desk 2019-06-05 16:36:48  jet chef ajay singh

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వైఫల్యంపై స్పైస్‌ జెట్ చీఫ్ అజయ్ సింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వైఫల్యం విమానయాన పరిశ్రమకు ఒక హెచ్చరిక అని, ఇప్పటికైనా జాగ్రత్తపడాలని సూచించారు. అలాగే ఈ వైఫల్యానికి విధానకర్తలే బాధ్యత వహించాలని అన్నారు. జెట్ ఎయిర్‌వేస్ మూతపడడం చాలా విచారకరమైనదని, ఈ సంస్థ వైఫల్యానికి అంతర్గత అంశాలు, అధిక ఖర్చులే కారణమని అన్నారు. విమానయాన రంగం, విధానకర్తలకు ఒక మేలుకొలుపు అని అన్నారు. జెట్ ఎయిర్‌వేస్ దేశీయ విమానయాన రంగంలో ఒక సంచలనం, 26 ఏళ్లుగా సేవలందించిన ఈ సంస్థ దేశీయంగా, అంతర్జాతీయంగా నెట్‌వర్క్‌ను పెంచుకుంది. అయితే అప్పుల భారం కారణంగా మూసివేయాల్సి వచ్చింది. బడ్జెట్ విమాన సంస్థ అయిన స్పైస్‌జెట్ తన సేవలను మరింత విస్తరిస్తోంది.ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్‌లో మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 30 విమానాలను లీజుకు తీసుకుంది. ఇప్పటికే స్పైస్‌జెట్ 100 విమానాలతో కీలక మైలురాయిని చేరుకుంది. కాగా స్పైస్‌జెట్ విస్తరణ ప్రక్రియలో భాగంగా 2000 మంది జెట్ ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. పైలట్లు, క్యాబిన్ క్రూ వంటి పలు విభాగాల్లో నియామకాలు చేపట్టనుంది. జెట్ ఎయిర్‌వేస్ నుంచి భారీ సంఖ్యలో నియమించుకున్నామని, వారంతా నాణ్యమైన, వృత్తి నిపుణులు అని, మరింత మంది జెట్ సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నామని సింగ్ అన్నారు. ఇప్పటి వరకు 1100 మంది నియామకం చేపట్టామని, ఈ సంఖ్య 2000 మందికి చేరనుందని ఆయన అన్నారు.