బోయింగ్‌తో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పందం!

SMTV Desk 2019-06-05 16:35:26  boeing, airport authority of India

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఎఎఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) అమెరికా ఎరోస్పేస్ దిగ్గజం బోయింగ్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భారత్‌లో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్(ఎటిఎం) ఆధునీకరణ కోసం 10 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియపై చర్చించినట్లు ఎఎఐ పేర్కొంది. యుఎస్‌డిటిఎ (యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) నుంచి మంజూరుతో 18 నెలల ప్రాజెక్టును చేపట్టనున్నారు. కమ్యూనికేషన్, నావిగేషన్, ఎటిఎం ఆధునీకరణపై దృష్టిపెట్టనున్నారు. భారత్‌కు అమెరికా రాయబారి అయిన కెన్నెత్ మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధిలో భారత్, అమెరికా దేశాల పటిష్టమైన భాగస్వాములు అని అన్నారు. ఎఎఐ, బోయింగ్ మధ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య విమానయాన రంగంలో సహకారాన్ని కొనసాగించడంలో మరో ముందడుగు అని అన్నారు.