నిర్మాతగా హీరో నాని..!

SMTV Desk 2017-08-29 14:59:21  HERO NANI, PRODUCER, DIRECTER PRASHANTH VARMA

హైదరాబాద్, ఆగస్ట్ 29 : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నాని "అష్టా చమ్మా" చిత్రంతో హీరోగా మారాడు. అలా ఒక చిన్న సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని "మిడిల్ క్లాస్ అబ్బాయి", "కృష్ణార్జున యుద్ధం" అనే చిత్రాలలో నటిస్తున్నారు. అయితే నటన పరంగా మంచి మార్కులను కొట్టేసిన నానికి నిర్మాతగా కూడా రాణించాలని ఒక కోరిక ఉందట. ఈ కారణంతో ఆయన గతంలోనే "డి ఫర్ దోపిడి" అనే చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అయితే మరోసారి నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ నానికి ఒక కథ వినిపించగా, అది నానికి నచ్చడంతో నిర్మాతగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతుండగా ఈ విషయంపై నాని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.