మరణాన్ని అంచనా వేసే మేధస్సు

SMTV Desk 2017-06-03 16:47:53  mind,artificial mind, meleborne, adilide university

మెల్ బోర్న్, జూన్ 3 : మనిషి భవిష్యత్తును అంచనా వేసే యంత్రాలతో కూడిన ఉహాజనిత సినిమాలు ..ఉద్వేగాన్ని..ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ ఉహలను నిజం చేస్తూ కొత్త ఆవిష్కరణ ప్రపంచం ముందుకు వచ్చేసింది. మనిషి శరీర అంతర్భాగాల చిత్రాల ద్వారా ఆ వ్యక్తి ఎంతకాలం బతుకుతాడో తెలిపే కృత్రిమ మేధో సాంకేతిక వ్యవస్థను శాస్ర్తవేత్తలు ఆవిష్కరించారు. అస్ర్టేలియాలోని అడిలైడ్ యూనివర్శిటి పరిశోధక బృందంలోని శాస్త్రవేత్తలు రూపోందించిన కృత్రిమ మేధో వ్యవస్థ 48 మంది రోగుల ఛాతీ భాగాల చిత్రాలను చూసి వారిలో ఎందరు ఐదేండ్లలో చనిపోతారో తేల్చి చెప్పిందట.. డాక్టర్ల విశ్లేషణతో పోల్చితే ఈ విధానంలో వేసే అంచనాలు 69 శాతం కచ్చితత్వంతో ఉంటున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం సైంటిఫిక్ జర్నల్ రిపోర్ట్స్ లో ప్రచురితమైంది. ఈ కృత్రిమ మేధో వ్యవస్థ పేషంట్ల రోగాన్ని వేగంగా నిర్ధారించడానికి, త్వరగా చికిత్సను అందించడానికి దోహదపడుతుందని ఆ వర్శిటికి చెందిన పరిశోధక విద్యార్థి ల్యూక్ ఓక్డెన్ రేనర్ తెలిపారు. వ్యక్తి వయసును, వారి ఆరోగ్యాన్ని బట్టి ఇప్పటి వరకు డాక్టర్లు వారి ఆయుష్షు గురించి చెప్పేవారు. అంతే తప్ప శరీరాంతర్భాగాలను, వాటన్నింటి సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించి ఇంత విశ్లేషణాత్మకంగా చెప్పలేకపోయేవారు. మేం రూపొందించిన లోతైన అధ్యయన విధానం ఇందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ అటోమేటెడ్ సిస్టమ్ ద్వారా శరీరాంతర్భాగాల చిత్రాలను అధ్యయనం చేసి కంప్యూటర్లు రోగులకున్న కాంగెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి క్లిష్టమైన జబ్బులను గుర్తించ గలుగుతున్నాయి అని రేనర్ వివరించారు.