గాయాలతో సతమతమవుతున్న సౌతాఫ్రికా జట్టు!

SMTV Desk 2019-06-05 16:16:42  south africa

ప్రపంచకప్ టోర్నీలో టీంఇండియాతో తలపడేందుకు సిద్దమయిన సౌతాఫ్రికాకు తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు నిండి లుంగి ఎంగిడి గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. తాజాగా సీనియర్ పేసర్ డెల్ స్టేయిన్‌ భుజం గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సుదీర్ఘం కాలంగా భుజం గాయంతో బాధపడుతున్న స్టెయిన్… ఇంగ్లండ్ గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్‌లకు కూడా దూరంగానే ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లకు కూడా స్టెయిన్‌ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. స్టెయిన్ గాయం ఎంతకీ తగ్గకపోవడంతో అతని స్థానంలో రేజా హెండ్రిక్స్‌ ను జట్టులోకి తీసుకుంటున్నట్టు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సౌతాఫ్రికాకు యివాళ భారత్‌తో జరిగే మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది.ప్రపంచకప్ నుంచి డెల్ స్టెయిన్ దూరమవడం తమకు పెద్ద దెబ్బేనని సౌతాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ అన్నాడు. స్టెయిన్ ఆడితే తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండేదని ఆయన పేర్కొన్నాడు. అయితే టీమ్‌ఇండియాతో జరిగే మ్యాచ్‌ తమకు ఎంతో కీలకమని… విజయం కోసం శక్తివంచన లేకుండా పోరాడతామని డూప్లెసిస్ తెలిపాడు.