ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు

SMTV Desk 2019-06-05 15:50:50  jagan,

సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆర్నెళ్ల నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని సవాల్ చేసిన ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం నుంచి వరుస భేటీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలతో బిజిబిజీగా గడుపుతున్నారు. అలాగే ఈరోజు కూడా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, ఈ సీజన్ లో రైతులకు నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు తదితరాలపై అధికారులతో సమీక్షించాలని జగన్ భావించారు. అయితే, నిన్న నెలవంక కనిపించడం, నేడు రంజాన్ పర్వదినం కావడంతో ఈ సమీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. దీంతో ఏపీ సీఎం నేటి తన అన్ని సమీక్షలను రద్దు చేసుకున్నారు. కాగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్ప్రవర్తనకి ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.