రెప రెప లాడుతున్న తెరాస జెండా

SMTV Desk 2019-06-05 15:49:21  TRS genda,

లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకొన్న కాంగ్రెస్‌, బిజెపిలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో చతికిలపడ్డాయి. ఉదయం 8గంటలకు ఓట్లు లెక్కింపు మొదలైనప్పటి నుంచే కారు జోరు మొదలై చివరి వరకు అదే స్పీడుతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన 5,738 ఎంపీటీసీ ఫలితాలలో తెరాస ఏకంగా 3,557 స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్‌, బిజెపిలకు అందనంత ఎత్తులో నిలిచింది.

రాష్ట్రంలో నేటికీ కాంగ్రెస్ పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయని నిరూపిస్తూ 1,377 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొని రెండవ స్థానంలో నిలువగా, బిజెపి కేవలం 211 స్థానాలకే పరిమితమైంది. దాని కంటే ఇతరులే ఎక్కువ స్థానాలు(593) గెలుచుకొన్నారు.

ఇక జెడ్పీటీసీ స్థానాలలో కూడా తెరాసదే పైచెయ్యిగా ఉంది. ఇప్పటి వరకు 530 స్థానాలకు ఫలితాలు వెలువడగా వాటిలో తెరాస 443 గెలుచుకొంది. కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలతో ద్వితీయస్థానానికి పరిమితం కాగా బిజెపి కేవలం 7 స్థానాలను మాత్రమే గెలుచుకొంది. ఇతరులు 5 స్థానాలు గెలుచుకొన్నారు.