కేదార్ జాదవ్ పూర్తి ఫిట్: కోహ్లీ

SMTV Desk 2019-06-05 15:48:42  kedar jadav, virat kohli, icc world cup 2019

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం ఓ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన కేదార్ జాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు ప్రకటించాడు. కోహ్లీ మాట్లాడుతూ...‘కేదార్ జాదవ్ ఫిట్‌నెస్ సాధించాడు. దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో అతను టీమ్‌ సెలక్షన్‌కి అందుబాటులో ఉన్నాడు. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే.. ఇప్పుడు టీమిండియా ఆటతీరు మరింత మెరుగైంది. జట్టులో కూడా సమతూకం పెరిగింది. రబాడ నా గురించి ఏమన్నాడో..? తెలియదు. కానీ.. ఒక మెరుగైన ఫాస్ట్ బౌలర్‌గా అతడ్ని నేను గౌరవిస్తా. ఇక ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఇటీవల జరిగిన మ్యాచ్‌లను చూడటం ద్వారా అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశాం. టోర్నీలో కొన్ని జట్లు అనూహ్యమైన విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో.. ఆ తప్పిదాలు చేయకుండా ఆడతాం’ అని వెల్లడించాడు.