పంచాయతీ ఎన్నికల గురించి రంగంలోకి జనసేనాని

SMTV Desk 2019-06-05 15:25:55  Pawan Kalyan, Jansena,

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రేపు విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడ్నుంచి పటమటలంకలోని తన నివాసానికి జనసేనాని వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక 7వ తేదీనుంచి మూడు రోజులపాటు నాలుగు జిల్లాల ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమావేశమవుతారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలకు పవన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు. సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు.