నవంబర్‌లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు

SMTV Desk 2019-06-05 15:24:08  srilanka, srilanka president elections

కొలంబో: ఈ ఏడాది నవంబర్‌ 15 డిసెంబర్‌ 7మధ్య శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల కమిషన్‌ ఛైర్మన్‌ మహింద దేశప్రియ ప్రకటించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం ముగియటానికి కనీసం నెలరోజులు ముందుగా అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. దేశాధ్యక్ష ఎన్నికలు డిసెంబర్‌ 7వ తేదీ ముందుగానే జరిగే అవకాశం వుందని అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన గత వారం న్యూఢిల్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ షెడ్యూలును ప్రకటించటం గమనార్హం. సిరిసేన ఐదేళ్ల అధ్యక్ష పదవీకాలం 2020 జనవరి8తో ముగియనున్నది. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ఓడించి 2015 జనవరి8న సిరిసేన లంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.