ఐఫోన్స్‌కు నయా ఓఎస్...స్పెషల్ ఫీచర్స్

SMTV Desk 2019-06-05 15:17:48  iPhone, apple, iPhone OS

టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తన ఐఫోన్స్‌కు కొత్త ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) సాఫ్ట్‌వేర్ను ఆవిష్కరించింది. ఈ సాఫ్ట్‌వేర్లో సరికొత్త ఫీచర్లను జోడించింది. అయితే ఈ ఓఎస్ కేవలం ఐఫోన్స్‌కు మాత్రమే. కంపెనీ ఐపాడ్స్ కోసం ప్రత్యేకమైన ఐపాడ్ ఓఎస్‌ను రూపొందించింది. యాపిల్ తన వార్షిక డబ్ల్యూడబ్ల్యూడీసీ డెవలపర్ సదస్సులో (కాలిఫోర్నియా, అమెరికా) ఈ ఐఓఎస్ 13ని ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐఓఎస్ 13 ప్రత్యేకతలు
✺ డార్క్ మోడ్
✺ స్వైపీ కీబోర్డు
✺ పోట్రైట్ లైటింగ్ ఫర్ ఫోటోస్ అండ్ రొటేట్ వీడియో
✺ ఫైండ్ మై ఫోన్ అండ్ ఫైండ్ మై ఫ్రెండ్స్
✺ సిరి అప్‌గ్రేడ్
✺ మెమోజి అవతార్స్
✺ పలు కొత్త యాప్స్
ఐఓఎస్ 13 ముందుగా పెయిడ్ డెవలపర్లకు అందుబాటులోకి వస్తుంది. పబ్లిక్ బీటా జూలైలో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. పబ్లిక్ బీటా ప్రారంభమైన తర్వాత ఎవరైనా సరే వారి ఐఫోన్లలో ఈ ఓఎస్‌ను పరీక్షించొచ్చు.