మైత్రి మూవీ మేకర్స్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్

SMTV Desk 2019-06-05 14:57:57  myhtri movie makers,

ఈ సంవత్సరం కన్నడంలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా కెజిఎప్. ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని భాషలకు చెందిన పరిశ్రమల్లోని నిర్మాతలు ఆ సినిమా దర్శకుడైన ప్రశాంతి నీల్ వెంటపడుతున్నారు.

తాజాగా టాలీవుడ్ లోని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కెజిఎఫ్ డైరెక్షన్లో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఈనిర్మాతలు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాని సెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది.. ఎప్పుడు మొదలవుతుంది.. ఎలా ఉండబోతుంది అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఛాఫ్టర్ 2 తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత తెలుగు ప్రాజెక్ట్ మొదలుకానున్నట్లు సమాచారం అందుతుంది.