నేటి రాత్రి నుండి మోటో జీ5ఎస్ ప్లస్ అమ్మకాలు

SMTV Desk 2017-08-29 13:57:42  Moto India, MOTO G5S plus, MOTO G5S plus price, MOTO G5S plus release date, Moto smartphones

ముంబై, ఆగస్ట్ 29: ఎఫర్డబుల్‌ ధరలతో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదలచేసే మోటరోలా సంస్థ సరికొత్త ఫోన్స్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా మోటో జీ5ఎస్‌ ప్లస్‌‌ను స్పెషల్‌ ఎడిషన్‌గా లాంచ్‌ చేసింది. మోటరోలా ఎండీ మధురుసూదిన్‌ మాట్లాడుతూ... మోటోకి ప్రజల నుండి మంచి ఆదరణ లంభించిందని, ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ బేసిస్‌లో ఈ క్వార్టర్‌లో 100 శాతం వృద్ధిని సాధించామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఫోన్ నేటి రాత్రి 11.59 ని.ల నుంచి అమెజాన్‌ లో ప్రత్యేకంగా లభించనుంది. దీంతోపాటు మిగతా ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులోఉంటుందని ఆయన తెలిపారు. జీ5 ఎస్‌ రూ.11,990లోనూ, స్పెషల్‌ ఎడిషన్‌గా లాంచ్‌ చేసిన జీఎస్‌ 5 ప్లస్‌ ఫోన్‌ ధరను 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,999​గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 15,999గా నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఇక జీ5ఎస్‌ ఫోన్ విశేషతలకు వచ్చేసరికి... 5.2 హెచ్‌డీ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమోరీతో పాటు 16 మెగాపిక్సెల్ వెనుక, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరాలతో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1500 వాట్‌ టర్బో చార్జింగ్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంది కాగా, మోటో జీ5ఎస్‌ ప్లస్ విశేషతలు 5.5 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.0 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌,13 ఎంపీ పిక్సెల్‌ రెండు రియర్‌ కెమెరాలు విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 4 జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సౌలభ్యంతో పాటు 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో పాటు వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 7.1. 1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది.