గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన గద్వాల మాజీ ఎమ్మెల్యే

SMTV Desk 2019-06-05 12:32:37  Gadwal, Bheemudu, MLA

గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దళిత, వెనుకబడిన వర్గాల పక్షపాతిగా ఆయనకు పేరుంది. భీముడు 1999లో గద్వాల నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుపెట్టారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యాడు. ఆయన రాష్ట్రంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాడారు. భీముడి తమ్ముడు తిమ్మప్ప మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మెన్‌గా పనిచేశారు.