పుణ్యక్షేత్రం బెజవాడ లో కలకలం

SMTV Desk 2019-06-05 12:25:40  vizayawada, durga temple,

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దొంగతనానికి యత్నించిన దంపతులు అడ్డంగా దొరికిపోయారు. అమ్మవారి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో వెలుగు చూసిన ఘటన కలకలం రేపుతోంది. అమ్మవారికి కానుకగా వచ్చిన వాటిలో కాసున్నర బంగారాన్ని పక్కన పెట్టి చోరీకి యత్నించాడు సింహాచలం అనే వ్యక్తి.

అందుకు సంబంధించి వెంటనే గుర్తించిన ఆలయ అధికారులు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు బెజవాడ పోలీసులు. హుండీ లెక్కింపు సమయంలో కాసున్నర బంగారాన్ని లుంగీలో వేసుకున్న సింహాచలం.. ఘాట్ రోడ్డు దిగువన ఆలయంలోనే స్వీపర్‌గా పని చేస్తున్న తన భార్యకు ఇచ్చినట్టు కనుగొన్నారు. అది గమనించిన ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు తెలిసిపోయింది.